హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ :
నకిలీ నోట్ల దందాకు చెక్ పెట్టేందుకు పోలీసులు ఎన్ని రకాల కఠిన చర్యలు చేపట్టినా.. ఏదో కొత్త మార్గాన్ని ఎంచుకొని నిందితులు రెచ్చిపోతున్నారు..
తాజాగా ఇలాంటిదే ఓ భారీ ఫేక్ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ కరెన్సీని తయారు చేస్తున్న అంతర్రాష్ట ముఠాను శంషాబాద్ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి మొత్తం రూ. 11 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నాట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, కొవ్వూరుకి చెందిన మలస్ల మోహన్ రావుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.