హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్: ఇంస్టాగ్రామ్ వీడియో షూట్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్టు తెలిసింది.
సనత్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోలను రికార్డ్ చేస్తుండగా ఎక్ ప్రెస్ రైలు ఆకస్మాత్తు గా ఢీకొనడంతో సర్ఫరాజ్ అనే 16 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకారం మరణించిన సర్పరాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శుక్రవారం వీడియోలు రికార్డ్ చేయడానికి సనత్‌నగర్ రైల్వే ట్రాక్‌కి వెళ్లాడు రైల్వే పట్టాలపై వీడియోలు షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు చెబుతున్నారు ..రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని స్నేహితులను కూడా పోలీసులు అదుపు తీసుకున్నట్టు తెలిసింది.