ఇరిగేషన్ శాఖ యాక్టింగ్ మినిస్టర్‌గా

Get real time updates directly on you device, subscribe now.

ఇరిగేషన్ శాఖ యాక్టింగ్ మినిస్టర్‌గా హరీశ్ రావు పనిచేస్తున్నారా ❓️

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ / మే 1: తెలంగాణ ఇరిగేషన్ యాక్టింగ్ మినిస్టర్ గా హరీశ్ రావు పనిచేస్తున్నారా? అంటే ఆఫీసర్ల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఇరిగేషన్ పై వరుసగా రివ్యూలు నిర్వహిస్తుండడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ఈ పోర్ట్ ఫోలియో సీఎం దగ్గర ఉండగా, ఇరిగేషన్ పెండింగ్ పనుల్లో వేగం పెంచేలా ప్రణాళికను సిద్ధం చేయడానికి హరీశ్ రావుకు సీఎం బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.


*పాలమూరు, సీతారామ ప్రాజెక్టులపై..*

పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులపై కొన్ని రోజులుగా మంత్రి హరీశ్ రావు కంటిన్యూగా రివ్యూలు పెడుతున్నారు. ఆయా ప్రాజెక్టుల పరిస్థితి, పనుల్లో పురోగతి వంటి వివరాలను సేకరిస్తున్నారు. కావాల్సిన నిధులు, అవసరమైన పర్మిషన్లు, సౌకర్యాలు వంటివన్నీ సమకూర్చేందుకు కృషి చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీశ్ క్రీయాశీలకంగా పనిచేశారు. ఆఫీసర్లతో సంబంధాలు ఉండటంతో ఆయనకు మానిటరింగ్ చేయడం సులువుగా మారింది.


*కాళేశ్వరంలో కీలకం…*

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మంత్రి కీలక భూమిక పోషించారు. నిత్యం వర్క్ సైట్లోనే ఉంటూ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. మాజీ గవర్నర్ నరసింహన్ ఆయనకు కాళేశ్వర రావు అనే బిరుదును కూడా ఇచ్చారు. రెండో టర్మ్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రారంభమైనా, అప్పటికీ మంత్రి పదవి లేకపోవడంతో హరీశ్ రావు 2019లో కాళేశ్వరం ఓపెనింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత సీఎం హరీశ్ రావును వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండడం గమనార్హం.

*టాస్క్ ఏదైనా..!*

హరీశ్ రావుకు ఏ టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తి చేస్తాడనే నమ్మకం సీఎంలో బలంగా ఉన్నది. దీంతోనే గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆరోగ్యశాఖ బాధ్యతను హరీశ్ కు అప్పజెప్పారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఆస్పత్రుల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. పాత ఆస్పత్రులను మెరుగుపరుస్తూనే కొత్త దవాఖాన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో ఇరిగేషన్ లోని పెండింగ్ ప్రాజెక్టులు కూడా వేగంగా పూర్తి కావాలంటే హరీశ్ కరెక్ట్ పర్సన్ అని సీఎం భావిస్తున్నారు. ఎన్నికలు రానుండడంతో పనుల్లో వేగం పెంచేందుకు కేసీఆర్ హరీశ్ రావును రంగంలోకి దించినట్లు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు చర్చించుకుంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment