కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు..

Get real time updates directly on you device, subscribe now.

కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు..

ఇకనుంచి ప్రెస్మీట్లన్నీ అక్కడే!


హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 1: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కొత్త సెక్రటేరియట్‌లోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా ఇంటర్నల్‌గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రధాన కార్యాలయంలోకి ఎంట్రీ లేకుండా చేయాలనే ముందుకుసాగుతున్నది. ఇందులో భాగంగా ప్రాంగణం బయటే మీడియా హాల్‌నూ ఏర్పాటు చేసింది. ప్రెస్మీట్లు, మీడియా చిట్ చాట్‌లు అక్కడ్నించే జరగనున్నాయి. ఇందుకు కూడా రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర అసిస్టెంట్లకు రెగ్యులర్గా పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త సెక్రటేరియట్లోకి మీడియా ఆంక్షలపై జర్నలిస్టుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి వివక్ష తగదని హెచ్చరించాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని.. స్వరాష్ట్రంలో ఆంక్షలు విధిస్తే సహించేది లేదని జర్నలిస్టుల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే సెక్రటేరియట్ముందు ధర్నాకు దిగుతామని హైదరాబాద్యూనియన్ఆఫ్జర్నలిస్టు సంఘం హెచ్చరించింది.


తాత్కాలిక భవనంలోనూ అంతే..

ఇన్నాళ్లు తాత్కాలికంగా రాష్ట్ర పరిపాలన భవనంగా కొనసాగిన బీఆర్కే భవన్లోనూ మీడియాపై ఆంక్షలు కొనసాగుతూ వచ్చాయి. కేవలం మంత్రులు ప్రెస్మీట్లు పెట్టినప్పుడే జర్నలిస్టులను అనుమతి ఇచ్చారు. ఆంక్షలు తగదని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదు. జర్నలిస్టుల పరిస్థితే ఇట్లా ఉంటే సామాన్యులకు ఎలా? ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్లకు సంబంధించి వర్క్తో వెళ్లినా.. లోపలి నుంచి పర్మిషన్లు ఇస్తేనే అనుమతి ఇస్తామని సెక్యూరిటీ తేల్చి చెప్పేది. ఉద్యోగులను కూడా ఐడీ కార్డులు చూపించినా అనుమతించలేదు. ఎన్నోసార్లు వెనుదిరిగిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్త సెక్రటేరియట్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండొచ్చని ఆర్అండ్బీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment