కార్మిక సంక్షేమం కోసం రెపరెపలాడిన నీలి పతాక అంబేద్కర్

Get real time updates directly on you device, subscribe now.

*కార్మిక సంక్షేమం కోసం రెపరెపలాడిన నీలి పతాక అంబేద్కర్*

*🖊️…… నవయాన్*


మే డే ప్రపంచ కార్మికుల పండగ. కార్మికుల  శ్రమ ద్వారా అపార సంపద పోగేసుకుంటున్న పెట్టుబడిదారులు వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడని దారుణమైన రోజులవి. అప్పట్లో రోజుకు 12 గంటల వరకు కార్మికులు పనిచేసేవారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇందులో ముఖ్యమైంది రోజుకు ఎనిమిది గంటల పని హక్కు. ఈ హక్కు కోసం కార్మికులు పోరాడి విజయం సాధించారు. ఈ పోరాటంలో భాగంగా వందలాది మంది కార్మికులు ప్రాణాలర్పించారు. 1886 మే మూడో తేదీన చికాగో లోని హే స్వ్కేర్ దగ్గర  పోలీసు కాల్పుల్లో ఒక వైపు రక్తం చిందుతుంటే మరో వైపు ఆ రక్తంలో తడిసిన ఎర్రబట్టను తమ జెండాగా కార్మికులు పైకెత్తి చూపారు.


ప్రపంచ కార్మికులు దేశాలకు, జాతులకు, భాషలకు అతీతంగా ఏకమై హక్కుల కోసం నినదిస్తుంటే, ఇండియాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జాతీయ వనరులను ఇక్కడి కార్మికుల శ్రమ ద్వారా ముడి సరుకుగా మార్చి ఇంగ్లాండుకు తరలించి, వాటి ద్వారా తయారైన ఉత్పత్తులను మళ్లీ ఇండియాలో అమ్ముతూ దేశసంపదను కొల్లగొట్టింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. దీంతో దేశీయ ఉత్పత్తి రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. అయినప్పటికీ ఇక్కడి కార్మికులలో చలనం రాలేదు. తిరుగుబాటు వైఖరి లోపించింది. దీనికి కారణం కార్మికుల అనైక్యత. కొన్ని వేల ఏళ్లుగా  భారతదేశ సమాజాన్ని పీడిస్తున్న కులవ్యవస్థ. దీని ప్రభా వంతో కార్మికులు కులాలుగా విడిపోయారు. కార్మికులంతా ఒకటే అనే భావన ఏర్పడలేదు. చివరకు రెండు ప్రపంచ యుద్ధాల కాలంలో  పెట్టు బడిదారీ వర్గాల మీద కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకువచ్చి తమ హక్కులు సాధించుకున్నాయి. కానీ భారతదేశంలో మాత్రం హక్కుల సాధనకు కార్మికుల్లోని  అనైక్యత అడ్డుగా నిలిచింది. ఈ పరిస్థితుల్లో కార్మిక సమాజానికి కొండంత అండగా , ఒక నవ బుద్ధుడిగా వచ్చారు బాబా సాహెబ్ అంబేద్కర్


అంబేద్కర్ లేకుంటే నేడు భారతదేశ కార్మికుల భవిష్యత్తు చీకటిలో ఉండేది. భారతదేశంలో బహు కోణాలు మరియు గొప్ప దూరదృష్టి కలిగిన ఏకైక నాయకుడు ఆర్థిక మాంద్యాల సమయంలోనూ భారతదేశాన్ని రక్షించినది డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన బలమైన ఆర్థిక విధానామే ఆర్‌బిఐ వ్యవస్థాపక మార్గదర్శకాలు ఆర్థిక వ్యవస్థలోని నియంత్రించే సూత్రాలే

భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబేడ్కర్, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్కరించారు. ఈ సమాజం పనినే కాకుండా కార్మికులను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమోదించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు

పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్ వివరించారు. వ్యక్తి తన సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు.

అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన, తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు

ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్ తో అతడికి ఒక షరతు పెట్టి ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం లేదు . ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయిపోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగుతాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు” అని అంబేడ్కర్ చెప్పారు.

కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బతీయగలదో సోదాహరణంగా చెబుతూ లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రాలకు విఘాతం కలిగిస్తుందని అంబేడ్కర్ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోవాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

అణగారిన వర్గాలు ముఖ్యంగా కార్మిక వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతుండటంపై అంబేడ్కర్ ఆవేదన చెందారు. ఈ వర్గాలకు విముక్తి కల్పించేందుకు అప్పటి సైద్ధాంతిక వాదనలను సవాలు చేశారు.

కార్మిక వర్గ సంక్షేమం కోసం దుర్వినియోగం అవుతున్న కార్మిక హక్కుల సాధన కోసం ఒక పార్టీ అంటూ ఉండాలని ఆశయ సంకల్పంతో 1936 ఆగస్టులో అంబేడ్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ(ఐఎల్‌పీ)’ని స్థాపించారు. తమది కార్మికుల పార్టీ అని ప్రకటించురు

1937లో జరిగిన ప్రావిన్సియల్ ఎన్నికల్లో ఐఎల్‌పీ 17 స్థానాల్లో పోటీచేసి, 14 చోట్ల విజయం సాధించింది. పోటీచేసిన 13 రిజర్వుడు స్థానాల్లో 11 చోట్ల, పోటీచేసిన నాలుగు జనరల్ సీట్లలో మూడు చోట్ల గెలిచి బ్రిటిష్ పాలనలో బొంబాయి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఐఎల్‌పీ కార్మికులు, చిన్నరైతుల కోసం పెద్దయెత్తున అనేక పోరాటాలు చేసింది దాని ఫలితంగా కార్మిక శాఖ నవంబర్ 1937లో స్థాపించబడింది కార్మిక వర్గాల సంక్షేమమే పరమావధిగా కలిగిన కార్మిక సంస్థగా ఐఎల్‌పీ 1937లో వెలువరించిన విధానపత్రంలో తనను తాను అభివర్ణించుకొంది.


1942 జులై 20న బ్రిటీష్ పాలకులు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్‌లో అంబేద్కర్‌ను కార్మిక సంక్షేమ శాఖ సభ్యునిగా చేశారు(( ఈ పదవి పార్లమెంటరీ మంత్రితో సమానం))
వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్‌లో 1942 జులై నుంచి 1946 జూన్ వరకు అంబేడ్కర్ సభ్యుడిగా ఉన్నప్పుడు కార్మికుల ప్రయోజనాల పరిరక్షణకు కీలక చర్యలు చేపట్టారు
1942లో ‘ త్రైపాక్షిక కార్మిక మండలిని ‘ ఏర్పాటు చేసి , కార్మికులకు సామాజిక భద్రతా చర్యలను పరిరక్షించడానికి, కార్మిక విధాన రూపకల్పనలో కార్మికులు మరియు యజమానులకు సమాన అవకాశం కల్పించి 1943 నవంబర్ 8న డాక్టర్ అంబేద్కర్ కార్మిక సంఘాలకు నిర్బంధ గుర్తింపు కోసం ‘భారత కార్మిక సంఘాల (సవరణ) బిల్లు’ను తీసుకొచ్చారు

కార్మిక సంఘాలకు నిర్బంధ గుర్తింపును ప్రవేశపెట్టడం ద్వారా కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేశారు కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె తీసుకునే అవకాశం కలిపించి దేశ ఆర్థికాభివృద్ధిలో అణగారిన వర్గాలు ముఖ్యమైన పాత్ర పోషించాలని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు.

కార్మికులను ‘కాంకరెంట్ లిస్ట్’లో చేర్చారు, ‘చీఫ్ మరియు లేబర్ కమిషనర్లను’ నియమించారు, ‘ లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిటీ’ని ఏర్పాటు చేశారు BP అగార్కర్ మార్గదర్శకత్వంలో ‘కార్మిక సంక్షేమ నిధి ‘ నుండి ఉత్పన్నమయ్యే ముఖ్యమైన విషయాలపై సలహా ఇవ్వడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేశారు కార్మికుల ప్రయోజనాల కోసం జనవరి 31, 1944న బొగ్గు గనుల భద్రత (స్టోవింగ్) సవరణ బిల్లును రూపొందించారు. 8 ఏప్రిల్ 1946న, కార్మికులకు గృహనిర్మాణం, నీటి సరఫరా, కార్మికులకు సహాయం చేసే ‘మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఫండ్’ను తీసుకొచ్చారు

పనిగంటలను 12 నుంచి 8 కి తగ్గించాలని 1942 నవంబరు 27న దిల్లీలో తన అధ్యక్షతన నిర్వహించిన నాలుగో భారత కార్మిక సదస్సులో అంబేడ్కర్ తొలిసారిగా ప్రతిపాదించారు. 1945 నవంబరు 27, 28 తేదీల్లో జరిగిన ఏడో సదస్సు కర్మారాగాల్లో వారానికి 48 గంటల పని విధానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది అధిక పనిగంటలతో కార్మికుడికి తగినంత వ్యక్తిగత సమయం లేకుండా చేయడం సరికాదని వ్యక్తిగత ఎదుగుదలకు, శారీరక సామర్థ్యం పెంపునకు కార్మికులకు వ్యక్తిగత సమయం అవసరమని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కార్మికులు తీవ్రమైన పని ఒత్తిడికి లోనయ్యారని, వారికి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉందని, తక్కువ పనిగంటలతో ఉపాధి పెరుగుతుందని పనిగంటల తగ్గింపునకు అనుగుణంగా వేతనాల తగ్గింపునకు, డీఏ తగ్గింపునకు(ధరలు పడిపోతే తప్ప) వీల్లేదని అంబేద్కర్ తన కార్మిక మెమోరాండం లో స్పష్టం చేశారు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలోని మహిళా కార్మికుల కోసం మైనన్స్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, మహిళా కార్మిక సంక్షేమ నిధి,మహిళలు మరియు బాల కార్మికుల రక్షణ చట్టం బొగ్గు గనులలో భూగర్భ పనులపై మహిళల ఉపాధిపై నిషేధాన్ని పునరుద్ధరించడం వంటి చట్టాలను తీసుకువచ్చారు మహిళా సాధికారత కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ ను అంబేద్కర్ పొందుపరిచారు. మహిళల పట్ల వివక్షను అంతం చేస్తూ రూపొందించిందే ఆర్టికల్ 15(3). అలాగే ఆడ, మగ అనే వివక్ష లేకుండా అందరూ జీవనోపాధి పద్దతులను కలిగి ఉండటానికి 39 (ఎ) ఆర్టికల్ ను ప్రవేశపెట్టారు. మనదేశంలో చాలా కాలం పాటు ఒకే పనిని ఆడ, మగ ఇద్దరూ చేసినా వేతనం విషయంలో వివక్ష ఉండేది. మగవాళ్లకు ఎక్కువ వేతనం, ఆడవారికి తక్కువ వేతనం ఇచ్చేవాళ్లు. ఈ దుర్మార్గానికి అంతం పలికారు అంబేద్కర్. సమాన పనికి సమానం వేతనం ఇచ్చే ఆర్టికల్ 39 (డి) ను రూపొందించారు. మగవాళ్లతో పోలిస్తే మహిళలు తక్కువ అనే మైండ్ సెట్ కు అనుగుణంగా అప్పట్లో అనేక దురాచారాలు ఉండేవి. ఇలా ఏ రూపంలోనైనా మహిళల గౌరవాన్ని తగ్గించే పాత కాలపు ఆచారాలను చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆర్టికల్ 51 (ఎ) (ఈ)ను రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రవేశపెట్టారు. అనేక చట్టాలను రూపొందించినందున కార్మికులందరూ డాక్టర్ అంబేద్కర్‌కు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు చెప్పాలి

అగ్ర కులాలు అని పిలవబడే వారు గొప్ప కార్మిక ప్రజా సంక్షేమ దేశాన్ని నిర్మించడంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషికి ఎప్పుడూ క్రెడిట్ ఇవ్వలేదు

మీరు పనిచేస్తున్న కంపెనీ మీకు ఆరోగ్య బీమాను అందిస్తుందంటే ఆ క్రెడిట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌దే . ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) కార్మికులకు వైద్య సంరక్షణ, వైద్య సెలవులు, పని సమయంలో తగిలిన గాయాల కారణంగా శారీరక వైకల్యం, కార్మికుల పరిహారం మరియు వివిధ సౌకర్యాల ఏర్పాటుకు సహాయం చేస్తుంది అంటే కార్మికుల ఉద్యోగుల సంక్షేమం కోసం బీమా చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత క్రెడిట్ అంబేద్కర్ దే
((కార్మికుల ఉద్యోగుల సంక్షేమం కోసం బీమా చట్టాన్ని తీసుకొచ్చిన తూర్పు ఆసియా దేశాలలో భారతదేశం మొదటి దేశం))

కార్మికుల ఉద్యోగుల ముఖంలో చిరునవ్వు తెప్పించే ‘డియర్‌నెస్ అలవెన్స్’ (DA) లో ప్రతి పెంపుదలకు ,లీవ్ బెనిఫిట,రివిజన్ ఆఫ్ స్కేల్ ఆఫ్ పే ‘లను కల్పించిన ఘనత క్రెడిట్ భారతదేశంలో అంబేద్కర్ మహనీయుడుకె చెందుతుంది

విద్యుత్ రంగంలో ‘గ్రిడ్ సిస్టమ్’ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతను డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారు డాక్టర్ అంబేద్కర్ మార్గదర్శకత్వంలో లేబర్ డిపార్ట్‌మెంట్ పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్, హైడల్ పవర్ స్టేషన్ సైట్‌లు, హైడ్రో-ఎలక్ట్రిక్ సర్వేలు, విద్యుత్ ఉత్పత్తి మరియు థర్మల్ పవర్ స్టేషన్ సమస్యలను విశ్లేషించడం కోసం “ సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్” (CTPB) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పవర్ సిస్టమ్ డెవలప్‌మెంట్ కోసం “సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్” (CTPB)ని స్థాపించారు ., హైడ్రో పవర్ స్టేషన్ సైట్‌లు, హైడ్రో ఎలక్ట్రిక్ సర్వేలు, విద్యుత్ ఉత్పత్తి మరియు థర్మల్ పవర్ స్టేషన్ పరిశోధన సమస్యను విశ్లేషించారు.
1945లో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన, బహుళ ప్రయోజనాల కోసం మహానదిని నియంత్రించడం వల్ల కలిగే ప్రయోజనాలపై పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు ఈ నిర్ణయంతో అంబేద్కర్ గారి నాయకత్వన
భారతదేశంలోని బహుళార్ధసాధక నదుల ప్రాజెక్టులైన దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, భాక్రా-నంగల్ డ్యామ్ ప్రాజెక్ట్, సోన్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ మరియు హిరాకుడ్ డ్యామ్ ప్రాజెక్ట్
లు పురుడు పోసుకున్నాయి
భారతదేశంలోని బహుళార్ధసాధక నదుల ప్రాజెక్టులకు మార్గదర్శ సృష్టికర్తగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు పవర్ ఇంజనీర్లు శిక్షణ కోసం విదేశాలకు వెళుతుంటే, కార్మిక శాఖ నాయకుడిగా విదేశాల్లో అత్యుత్తమ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే విధానాన్ని రూపొందించిన ఘనత మళ్లీ డాక్టర్ అంబేద్కర్‌కే చెందుతుంది.

ఇవాళ్ల మన ఇళ్లలో విద్యుత్ వెలుగులు గొప్పగా వెలిగిపోతున్నాయి . వాట్ని రాజేసింది . అంబేద్కరే ! ఇండియాలో గ్రిడ్ విధానంలో విద్యుత్ సరఫరా జరగటానికి , పవర్ సప్లై వ్యవస్థ ఏర్పడటానికి అంబేద్కర్ కృషి ఎంతో వుంది ఎన్నో పెద్ద పెద్ద కట్టడాలు సాకారమయ్యాయి అంబేద్కర్ వల్లే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది . ఆయన వల్లే దేశంలోని కోట్లాది కార్మికులు క్షేమంగా వుంటున్నారు . ఆయన రూపొందించిన లేబర్ లాసే నేటీకి మన సమాజాన్ని నిర్దేశిస్తున్నాయి !

డా.బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు భారత్ సంవిధాన సభలో తన మొదటి ఉపన్యాసంలో State and minorities పై రిప్రంజెటేషన్ ఇవ్వడం జరిగింది . డా.బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు state socialism గూర్చి మాట్లాడుతూ ” ఈ దేశ ఆర్థిక వనరులయినటువంటి భూమి , ఖనిజ_సంపద , మరియు పరిశ్రమలను జాతీయకరణం చేయాలి . ఈ దేశంలో పుట్టే ప్రతి వ్యక్తికి ఆ వ్యక్తి పేరిట భీమ ( insurence ) చేయాలి ” … అని చెప్పడం జరిగింది . ఒక వేల సంవిధాన సభ డా . బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు చెప్పింది విని ఉంటే ఈ దేశంలో పేదరికం ఉండేది కాదు , నిరుద్యోగ సమస్య ఉండేది కాదు . ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి సామాజిక , ఆర్థిక , రాజకీయ సమన్వయం దక్కేది … ఫలితంగా ప్రపంచ దేశాల్లో భారత దేశం మొదటి స్థానంలో ఉండేది .

ఈ దేశంలో ఎన్నో ఎన్నో విధాలుగా విభజనకూ, తద్వారా వివక్షకూ గురౌతున్న స్త్రీల, అణచివేయబడ్డ కులాల, వర్గాల ప్రజల, ఉద్యోగుల, కార్మికుల హక్కుల పట్ల, జీవన భద్రతపట్ల, నిబద్ధతతో పనిచేసి హక్కుల కల్పించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్.

అంబేద్కర్ అంటే మెజారిటీ భారత ప్రజలకు గుర్తొచ్చేది దళిత నాయకుడు రాజ్యాంగ రచయిత అని మాత్రమే. మన పాఠ్య పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు ఆయన్ని భావి భారత పౌరులకు అలాగే పరిచయం చేసాయి మరి. కొన్ని వర్గాలకూ, కులాలకు మాత్రమే అధికారం, అవకాశం దక్కుతూ, మిగతా మెజారిటీ ప్రజలంతా పాలితులుగా, పాలక వర్గాల పీడనను భరించాల్సిన వారుగా మాత్రమే మిగిలిపోతున్న నిచ్చెన మెట్ల భారత సమాజాన్ని సమూలంగా ప్రక్షాళణ గావించిన సమ సమాజానికి బాటలు వేసిన అసలైన మానవతావాది, హక్కులపోరాట నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అన్నది నొక్కి వ్యాఖ్యానించవలసింది నిజమే అయినా , మనువాద భావజాలాన్ని మెదడంతా పరచుకున్న ఆనాటి ఈనాటి రాజకీయ శక్తులు, బాబాసాహెబ్ కృషిని,త్యాగాన్ని తెలియకుండా నొక్కిపట్టే ప్రయత్నం చేశాయి చేస్తున్నాయి ఆయన కృషినీ, త్యాగాన్ని సామ్యవాద ప్రజాస్వామ్య సమాజం పట్ల ఆయన అవిశ్రాంత పోరాటాన్నీ, పాఠ్య పుస్తకాలోకి చేరకుండా అడ్డుపడ్డాయి

ఎన్ని మబ్బులు అడ్డం వచ్చిన ఉదయించిన సూర్యుడు ప్రచండడై వెలుగొందాక మానడు ఆ వెలుగు రేఖలు ఈ అడ్డుగోడలను చిల్చక మానవు అందుకే సూర్యుడి లాంటి అంబేద్కర్ కృషి త్యాగం బహిర్గతమయ్యాయి.

భారతదేశంలో కార్మిక మహిళా ఉద్యోగులు ఈనాడు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు బాబాసాహెబ్ అవిశ్రాంత కృషి ఫలితమే అని ఈనాటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచమంతా కార్మిక హక్కుల పండుగ మే డే ను జరుపుకుంటున్న ఈ మంచిరోజున
కమ్యూనిష్టు పార్టీలు, మహిళా సంఘాలు, కార్మిక నాయకులు అందరూ మానవ కార్మిక హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ పోరాట అవిరళ కృషిని మే డే ఉత్సవాల్లో ప్రస్తావించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది.

మే డే సందర్భంగా చిన్న చిన్న నాయకులను కూడా గొప్పగా తలచుకునే కమ్యూనిస్టులు, అంబేద్కర్ ను ప్రస్తావించకపోవడం కరెక్ట్ కాదు. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషిని కావాలని మరుగునపరిచే కుట్రలో భాగమే. వందల కొద్దీ  చట్టాలు ఉన్నా అవి సరిగా అమలుకు నోచుకోకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఈ సమయంలో బాబా సాహెబ్ ఆలోచనా విధానమే ఇండియాకు శరణ్యం.

*🖊️… నవయాన్*
*రవివర్మ. పాలడుగు*
*9704722470*

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment