తెలంగాణ పునర్నిర్మాణమంటే ఇదీ!

Get real time updates directly on you device, subscribe now.

మీరు మరుగుజ్జులు కదా మీకు కనబడదులే


హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాదు/ఏప్రిల్ 30:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

‘తెలంగాణ అవతరణకు ముందు అనేక వాదోపవాదాలు, అనేక చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని పిచ్చివాళ్లు కొందరు కారుకూతలు కూశారు. కొన్ని పిచ్చివాంతులు కూడా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏంటీ? ఉన్నయన్ని కూలగొట్టి మళ్లీ కడతారా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మల్ల కడతారా? అని విపరీతమైనటువంటి, దుర్మార్గమైనటువంటి కురచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. మనం వేటినీ పట్టించుకోకుండా ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం గర్వంగా ప్రకటిస్తున్నా’నన్నారు.

మండ వేసవిలో మత్తడి దుంకే చెరువులే పునర్నిర్మాణానికి భాష్యం..
‘పునర్నిర్మాణం అంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు నాలుగు మాటలు చెప్పదలచుకున్న. పునర్నిర్మాణం అంటే నాడు సమైక్య పాలనలో చిక్కిశల్యమైపోయి.. శిథిలమైపోయి రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కూడా కోల్పోయి అద్భుతమైన కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మాణమైనటువంటి చెరువులన్నింటిని పునరుద్ధరించి ఎండాకాలంలో కూడా మత్తల్లు దుంకే చెరువులే పునిర్మాణానికి భాష్యం. అనేకమైన ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి. జీవనదులు ఉన్నాయి. ఉద్యమం సందర్భంలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా నదీమాతకు.. నాణేలు నదిలో వేసి రెండుచేతులు జోడించి దండంపెట్టి.. తల్లీ మా భూమి మీదకు ఎప్పుడు వస్తవ్‌? మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండంపెట్టేవాడని.

నాటి సమైక్య రాష్ట్రంలో దుస్థితి ఏంటంటే గోదావరి డబ్బులు, రాగి నాణేలు వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయో వెతుక్కొని రామగుండం వద్ద బిడ్జి మీద నుంచి నడిచి ఎక్కడ చిన్నపాటి గుంతలో నీళ్లు కనిపిస్తే వేసేది. ఈ రోజు రామగుండానికి వెళ్తే కండ్ల ముందే ఉన్నరు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ, ఇరిగేషన్‌ చీఫ్‌ సెక్రెటరీల ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టిఇరిగేషన్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాజ్టెకు శిఖరాయమానంగా ప్రపంచానికే తలమానికంగా వెలిగింది. ఇదీ పునర్నిర్మాణం. వాగుల మీద నిర్మించిన చెక్‌డ్యామ్‌లో గోదావరి, కృష్ణ, మంజీర, మానేరు, హల్దీ, కూడవెళ్లి తదితర ఉప నదులపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లు ఏప్రిల్‌, మేలో కూడా మత్తడి దుంకడమే.. కళ్లుండి చూడలేని కబోదులకు తెలంగాణ పునర్నిర్మాణానికి భాష్యం’ అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం..
‘ఆ నాడు నెర్రలుబారి నోళ్లువెల్లబెట్టి బీళ్లుగా లక్షలాది ఎకరాల తెలంగాణ భూములు నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని లక్షల ఎకరాల పంట పొలాలు వెదజల్లుతున్న హరితకాంత్రే తెలంగాణ పునర్నిర్మాణం. ఒక మాట గర్వంగా చెప్పాలి. ఈ యాసంగి పంటలో భారతదేశంలో ఉన్న వరి పైరు 94లక్షల ఎకరాలు. ఇందులో 56లక్షల ఎకరాలు తెలంగాణలో యాసంగిలో పంట పండుతున్నది నేను సగర్వంగా చెబుతున్నా. ఆ పొలాల్లో కనిపిస్తున్న హరితక్రాంతే తెలంగాణ పునర్నిర్మాణం. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం. ఒక పాలమూరు ఎత్తిపోతల పథకం. ఒక సీతారామా ప్రాజెక్టు అని మనవి చేస్తున్నా.

అర్ధరాత్రి కరెంటు పోయి.. ఎప్పుడు వస్తుందో తెలియక, పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో నేడు అవన్నీ మాయమై అద్భుతమైనటువంటి కాంతులతో వెలుగుజిలుగులతో జాజ్వల్యమానంగా, కరెంటు వెలుగులతో విరాజిల్లుతున్న తెలంగాణ ఇదీ పునిర్మాణం అంటే. అర్ధరాత్రి కరెంటు పెట్టేందుకు వెళ్లి పొలాల దగ్గర కరెంటు షాకులతో చనిపోయిన రైతులు నాడు, పాము, తేళ్లకాట్లతో చనిపోయిన రైతులు నాడు. నేడు దినం పూటనే సాయంత్రం 6 గంటల వరకు పొలాలను పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా కునుకుపోతున్న మా తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పునిర్మాణమని తెలియజేస్తున్నా’నన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక మిషన్‌ భగీరథ
‘గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరాలుతున్నాయో, ఎన్ని అవార్డులు సొంతం చేసుకుంటున్నాయో మీ అందరికీ తెలుసు. క్షీణించిపోయి, పత్తాలేకుండాపోయి అగమైనపోయిన అడవులు.. పీసీసీఎఫ్‌లు శోభ, డోబ్రియాల్‌ నేతృత్వంలో అటవీశాఖ అధికారుల పట్టుదల, కృషితో భూపాల్‌రెడ్డి, ప్రియాంక సారథ్యంలో దేశంలోనే ఆల్‌టైమ్‌ రికార్డుగా హరితశోభను వెదజల్లుతున్నయో అదీ తెలంగాణ పునర్నిర్మాణం అంటే. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోడమే పునిర్మాణమని ఆ అర్భకులు, ఆ మరుగుజ్జులకు చెబుతున్నా.

వలసపోయిన పాలమూరు కూలీలు ఒక్కరూ కూడా వలసలో లేకుండా మొత్తం కూడా తిరిగి వచ్చి వాళ్ల సొంత పొలాల గట్ల మీద కూర్చుంటే ఇతర రాష్ట్రాల కూలీలు తెలంగాణ పొలాల్లో పని చేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణమని చెబుతున్నా. ఒకనాడు దాహంతో అల్లాడి, ఫ్లోరైడ్‌ నడుం వంగి లక్షలాది మంది జీవితాలు కోల్పోయిన, కుమిలిపోయిన తెలంగాణలో మిషన్‌ భగరీథలో ఇంటింటికీ నీరందిస్తున్నాం. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఏ నీళ్లు ఉంటయో.. ఆదిలాబాద్‌ గోండుగూడెంలో అదే నీరందిస్తున్న మిషన్‌ భగరీథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment