హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లో ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోడీ. 100వ ఎపిసోడ్ సందర్భంగా దేశ వ్యాప్తంగా 4లక్షల వేదికలు ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ తో పాటు వెయ్యి రేడియో స్టేషన్లతో మన్ కీ బాత్ లైవ్ ప్రసారం చేశారు.
మన్ కీ బాత్ ద్వారా ప్రజల్లోని భావోద్వేగాలను తెలుసుకునే అవకాశం దొరికిందన్నారు మోడీ. సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ప్రజాలోనే ఉన్నానని, 2014లో ఢిల్లీకి వచ్చిన తర్వాత పరిస్థితి అంతా మారిపోయిందన్నారు. అప్పటి స్మృతులు గుర్తు చేసుకున్నారు ఇతరుల నుండి నేర్చుకునేందుకు మాన్ కి బాత్ ఎంతో తోడ్పడుతుందన్నారు. మీతో దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతోందన్నారు. దేశ ప్రజకు దగ్గరగా ఉండాలని నా కోరిక, పదవి ప్రోటోకాల్ కేవలం వ్యవస్థకే పరిమితం అన్న మోడీ.. జనంతో కలవడానికి, మాట్లాడటానికే ప్రాధాన్యత ఇస్తాన్నారు.
మణిపూర్ కు చెందిన విజయశాంతి దేవితో ఫోన్ లో మాట్లాడారు ప్రధాని మోడీ. మహిళల సాధికారత కోసం పని చేస్తున్న విజయశాంతి తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఇతర దేశాల నుండి ఆర్డర్స్ వస్తున్నాయన్నారు. అటు విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి ప్రస్తావించారు ప్రధాని. భారతీయ వస్తువులే ప్రసాద్ ఎక్కువ ఉపయోగిస్తారన్నారు ప్రధాని నరేంద్రమోడీ.