ఎస్సీ సబ్ ప్లాన్ పైన మొదటి సంతకం

Get real time updates directly on you device, subscribe now.

*ఎస్సీ సబ్ ప్లాన్ పైన మొదటి సంతకం* *మంత్రి కొప్పుల ఈశ్వర్*


హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ :ఏప్రిల్ 30
నూతన సచివాలయం ఛాంబర్ లో
ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ పూజలు నిర్వహించారు
వేదమంత్రోత్సలు నిర్వహించి మంత్రి కొప్పుల ను ఆశీర్వదించిన అర్చకులు, ఎస్సీ సబ్ ప్లాన్ ఫైల్ పై మొదటి సంతకం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

మంత్రి కొప్పుల ఈశ్వర్ నూతన సచివాలయంలో తన ఛాంబర్ లో సతీమణి స్నేహలత, కూతురు నందిని, అల్లుడు అనిల్ కుమార్, మనవడు భవానీ నిశ్చల్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, యంపి వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ ఎల్. రమణ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటీ దామోదర్ గుప్తా, ఉమ్మడి కరీంనగర్ డి.సి.ఎం.ఎస్. చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రామగుండం మేయర్ అనిల్, జగిత్యాల పెద్దపల్లి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు చంద్ర శేఖర్ గౌడ్, రఘువీర్ సింగ్, రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణ రావు, జెడ్పీటీసీ లు బాధినేని రాజేందర్, రాజేందర్ రావు, ధర్మారం మండలం నందిమేడారం పాక్స్ చైర్మన్ బలరాం, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మకరంద్, ఎస్సీ అభివృద్ధి,. మైనారిటీ, దివ్యంగుల శాఖా అధికారులు, సిబ్బంది, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment