హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండల పరిధిలోని ఎర్రకుంట తండాలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తండా శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారి కేంద్రాలపై దాడులు జరిపిన పోలీసులు.. నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.
8 లీటర్ల నాటు సారాను సీజ్ చేసిన పోలీసులు.. సారాను తయారు చేస్తున్న బోడ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. సారా త్రాగితే వచ్చే రోగాలపై తండా వాసులకు వివరించారు. ఎవరైనా సారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.