జర్నలిస్టుల హక్కుల సాధనే డిజెఎఫ్ ధ్యేయం
డిజెఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మాసం, కొంతం బాధ్యతల స్వీకరణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( డిజెఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మాసం రత్నాకర్ పటేల్, కొంతం యాదిరెడ్డిలు బాధ్యతలను స్వీకరించారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నేతాజీ భవన్‌లో డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో నేతాజీ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మెన్, డిజెఎఫ్ క్రమశిక్షణా సంఘం సభ్యులు అల్లూరి అచ్యుత రామరాజు చేతుల మీదుగా డిజెఎఫ్ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాసం రత్నాకర్ పటేల్, కొంతం యాదిరెడ్డిలు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ మాట్లాడుతూ డిజెఎఫ్ జర్నలిస్టుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. పాత్రికేయుల హక్కుల సాధనే డిజెఎఫ్ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ, సామాజిక ప్రముఖులు రామాగౌడ్, పుటం పురుషోత్తం, ఆనందం, డిజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు మానసాని కృష్ణా రెడ్డితోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో డిజెఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.