ఇవాళ ఓడితే అస్సామే మామవార్నర్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
ఇకపై ప్రతి మ్యాచ్ ముఖ్యమే.. ఓడిపోతే ఛాన్సులు దాదాపు లేనట్లే లెక్క..
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ రెండు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది.
ఇవాళ ఉప్పల్ వేదికగా క్యాపిటల్స్ తో తలపడనుంది సన్ రైజర్స్. మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ముందు ఆడాల్సిన ప్రతీ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో అందరిచూపు వార్నర్ పైనే ఉంది. గతంలో సన్‌రైజర్స్ తరఫున ఆడిన వార్నర్.. ఇప్పుడు అదే టీమ్‌పై ఇరగదీయాలన్ని చూస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఎంతో చేరువైన వార్నర్ నాయకత్వంలోనే సన్‌రైజర్స్ టీమ్ 2016లో ఐపీఎల్ కప్ సాధించింది.

నిజానికి జట్టులో వార్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఇప్పటికీ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూనే ఉన్నారు.. వార్నర్ ఉండి ఉంటే కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ సమస్య కూడా ఉండేది కాదని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.