హ్యూమన్ రైట్స్ టుడే: రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం… అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య.. ఈయన పూర్వం ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . ఎదో పని మీదా అయన ఖమ్మం కలెక్టర్ ఆఫీసుకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని తనపని తాను చేసుకుంటుండగా ఆరోజుల్లో నాకు దొరికిన ఒక మంచి ఫోటో. . ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా ఇంతే సింప్లిసిటీని మైంటైన్ చేసారు . బస్సులో ,రైల్లో హైదరాబాద్ కి రావడం , ఆటోలో అసెంబ్లీకి వెళ్ళడం , పార్టీ ఆఫీస్ లో పడుకోవడం ఇది అయన ట్రాక్ రికార్డు .. ఇప్పటికి అయన పేరు మీదా ఓ పొలం తప్ప మరేమీ లేదు .. ఇంతా సింప్లిసిటీగా బతికే లీడర్ ని ఇక మనం భవిషత్తులో చూడలేం కావచ్చు బహుశా .. ! గ్రేట్ లీడర్
ఆ కాలంలో గన్‌మెన్లను తిరస్కరించిన గొప్ప నాయకుడు గుమ్మడి నర్సయ్య. అప్పట్లో ఇద్దరు గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయిస్తే వద్దని చెప్పి వారించిన గ్రేట్ లీడర్ ఆయన. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారనే టాక్ ఉంది. అదలావుంటే ఇప్పటికీ కూడా ఆయన వ్యవసాయంపైనే ఆధారపడుతూ జీవనం సాగిస్తుండటం విశేషం.