న్యాయ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి…

Get real time updates directly on you device, subscribe now.

న్యాయ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి…

అమ్మకం, కొనుగోలు

హ్యూమన్ రైట్స్ టుడే:

1. స్తిరాస్థి అనగా స్థలాలు, పొలాలు, ఇళ్లు, షాపులు, గోడౌనులు మొదలైనవి. అమ్మాలన్నా, కొనాలన్నా, గిష్టు ఇవ్వాలన్నా, భాగపంపిణి చేసుకునేటప్పుడు, వీలునామా వ్రాసేటప్పుడు, వీలునామా అమలుకొరకు, మరియు అద్దె, లీజు, తాకట్టు వగైరాల విషయంలో అగ్రిమెంట్లు, దస్తావేజులు వ్రాయుట మరియు పరిశీలించి న్యాయ సలహా కోసం…….

2. నగదు అప్పులు ఇచ్చుట, వసూలు చేసుకునుట, హామీ ఉండుట, చేబదులు ఇచ్చుట ఇతర లావాదేవీలు ఏమైనా ముందుగా గాని, తర్వాత గానీ, భవష్యత్తు జాగ్రత్తకై న్యాయ సలహా కోసం……

ప్రభుత్వ కార్యాలయాల్లో

3. రెవిన్యూ, రిజిష్టారు, తహసీల్దారు. గ్రామ పంచాయితీ మరియు ఏ ప్రభుత్వ కార్యమునకు సంబంధించిన లేదా అధికారి వారికి సంబంధించిన విషయము గురించి లేదా సమస్య గురించి న్యాయ సలహా కోసం……

4. నూతన వ్యాపార, వ్యవస్థాపక కార్యక్రమాల కై అగ్రిమెంట్లు, అర్జీలు, పర్మిషన్లు గురించి సమస్యలు లేదా సలహాలకై మరియు పెట్టుబడుల లావాదేవీలు గురించి భవష్యత్తు విధివిధానాల న్యాయ సలహా కోసం……

5. అన్ని సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇతర కోర్టు వివాదాలలో వాదించుటకు….

7. మన రాజ్యాంగ ప్రాధమిక హక్కుల పరిరక్షణ, పర్యావరణ మరియు పరిసరాల, ప్రజా ఆరోగ్య, వనరుల

వినియోగము వాటికై హక్కలు, బాధ్యతల న్యాయ సలహాల కోసం……..

మరియు వ్యవసాయ, విహాహ, విద్యా, విదేశీయాన, ఉద్యోగ తదితర విషయాలపై కూడా న్యాయ సలహాలకై న్యాయవాదులను సంప్రదించటం మంచిది.
[20/04, 8:56 am] Nidhi Bank: 🌹 *వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కన్సమర్ కోర్టులో నష్టపరిహారం* కోరవచ్చు – సుప్రీం సంచలన తీర్పు.* 🌹
దేశంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి వస్తారని ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ డి.వై.చంద్ర చూడ్, జస్టిస్ హిమా కోహ్లి తమ తీర్పులో సేవలు అన్న పదానికి విస్తృతమైన నిర్వచనం ఉందని చెపుతూనే ఏ తరహా సేవలైనా వినియోగదారులు రక్షణ చట్టం పరిధిలోకి కచ్చితంగా వస్తాయని, వైద్యుడు , రోగి మధ్య ఉండే సంబంధం యజమాని సేవకుడు సంబంధం కాదని వైద్య సేవ అనేది వైద్యుడు రోగి మధ్య కుదుర్చుకున్న వ్యక్తిగత ఒప్పందం (కాంట్రాక్టు)అని, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులకి వినియోగదారుల రక్షణ చట్టం నుండి మినహాయింపు లేదని తీర్పనిచ్చింది . ఈ తీర్పు తో వైద్య రంగంలో దోపిడీకి అడ్డు కట్ట వేసినట్లయిoది
వినియోగదారుడి పట్ల ఒక వైద్యుడి నిర్లక్ష్యం పై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా” మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్” సుప్రీంకోర్టులో పిల్ వేసింది.దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ వినియోగదారులకి అండగా ఇటీవల చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దేశంలో రోగుల పట్ల అన్యాయంగా వ్యవహరించే, అడ్డగోలు దోపిడీ చేసే వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు వినియోగదారుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి సుప్రీంకోర్టు తీర్పు తో ఏర్పడింది. ఇది ముమ్మాటికీ వినియోగదారుల విజయం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment