కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ: భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌లు అమలు (Women’s Reservation Bill) చేయాలనే డిమాండ్‌తో కవిత దీక్ష చేస్తున్నారు. అంతకుముందు వేదిక వద్దకు చేరిన ఎమ్మెల్సీ కవిత పలువురు జాతీయ నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్షలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, రేఖానాయక్‌తోపాటు భారత జాగృతి మహిళా నేతలు కూర్చుకున్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీ దీక్షలో పాల్గొని సంగీభావం తెలిపారు.

ఈ దీక్షకు దేశవ్యాప్తంగా 13 పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. దేశంలోని మహిళా హక్కుల సంఘాలు, వివిధ పార్టీల నేతలు దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు దీక్ష సీపీఐ కార్యదర్శి డీ రాజా దీక్షను ముగించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment