అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిందే ఈ లిక్కర్‌ స్కామ్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే

Get real time updates directly on you device, subscribe now.

అధాని చేసిన అవినీతి, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా, ఎల్‌ఐసి ద్వారా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిందే ఈ లిక్కర్‌ స్కామ్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్: అధాని చేసిన అవినీతి, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా, ఎల్‌ఐసి ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు పెట్టించి అందులో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిందే ఈ లిక్కర్‌ స్కామ్‌ అని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. లిక్కర్‌ స్కామ్‌ ఘటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చి ఇతర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అక్కడి ప్రభుత్వాలను పడగొట్టారని, అదే ఫార్ములతో తెలంగాణలో 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి భంగపడ్డారని, ఇక్కడ సిట్‌ విచారణ చేస్తుండగానే న్యాయస్థానంలో కేసు కొట్టివేయించి సిబిఐకి కేసు అప్పగించారని, దీన్ని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి లిక్కర్‌ స్కామ్‌ను తెరపైకి తీసుకొచ్చి మా నాయకురాలు కవిత పేరున ఈడి నోటీసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మా నాయకుడు గట్టి వాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వ పప్పులు ఉడకలేదని, దీన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్ర విధానాలకు ఎండగట్టడానికి బిఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేంద్రంలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే తమకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయన్న దురుద్దేశ్యంతో మరోసారి లిక్కర్‌ స్కామ్‌ను తెరపైకి తీసుకొచ్చి సిసోడియాను అరెస్టు చేయించారని, అదే విధంగా వేరే వారు చెప్పిన్నట్టుగా మా నాయకురాలు కవితగారి పేరును అందులో ఇరికించారని అన్నారు. కవిత బినామిగా కేంద్రం చెబుతున్న వ్యక్తికి బెయిల్‌ రావడం జరిగిందన్నారు. కేంద్ర సంస్థలను తమ గుప్పిటలో ఉంచుకొని బిజేపి పాలిత రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడకుండా బిజేపి తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్న పార్టీలనే టార్గెట్‌ చేస్తూ వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ కుటిల రాజకీయం గురించి అర్థమైందని అన్నారు. బిజేపి సోషల్‌ మీడియా నిర్వహస్తున్న వారికి జీతాలను అదాని చెల్లిస్తున్నాడని పేర్కొన్నారు. బిజేపి సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకొని కవితగారిపై తప్పుడు ప్రచారాలను చేయిస్తూ ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బిజేపి పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరుగుతున్నా ఎందుకు సిబిఐ, ఈడి వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. మా నాయకుడు గట్టివాడు, మొండి వాడు కాబట్టే అధికారాన్ని అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మా నాయకుని వెంట యావత్‌ తెలంగాణ ప్రజలే కుండా దేశంలోని ప్రజలు అండగా ఉన్నారని స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment