నిందితుడు ద‌స్త‌గిరి అకౌంట్‌కు 75 వేలు జ‌మ చేసింది ఎవ‌రు ? ఎందుకు చేశారు ?

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వై.యస్.అవినాష్‌రెడ్డి
రిట్ పిటిషన్‌ దాఖలు…

*వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణపై సందేహాలెన్నో?*…

*సీబీఐ విచార‌ణ‌ పంజ‌రంలో చిలుక‌లా మారింద‌నే విష‌యంపై ప‌లు విమ‌ర్శ‌లు…*

*వివేకాను గొడ్డ‌లితో కిరాత‌కంగా చంపిన‌ట్లు నేరం అంగీక‌రించిన ద‌స్త‌గిరిని జైల్లో ఒంట‌రిగా న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏమిటి ?*


*వివేకా హ‌త్యలో విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న అల్లుడు న‌ర్రెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని సీబీఐ ఎందుకు విచార‌ణ‌కు పిల‌వ‌డం లేదు.*

*ద‌స్త‌గిరి ఎవ‌రి పేరు చెబితే వారిని చార్జిషీట్‌లో పెట్టి విచార‌ణ‌కు పిలిస్తే … అందులో విశ్వ‌స‌నీయత ఎంత‌?*

*ఒక‌వేళ నిందితుడు ద‌స్త‌గిరి డ‌బ్బుల‌కు గానీ, లేక‌పోతే ఒక ర‌క‌మైన ఇమేజ్‌ను పెంచుకునేందుకు హ‌త్య‌లో చంద్రబాబు, మోడీ పాత్ర ఉందంటే పిలిచి విచార‌ణ చేస్తారా ? ఇలా చేస్తే స‌మాజం హ‌ర్షిస్తుందా..?*

*నిందితులపై ఒత్తిడి తెచ్చి బ‌ల‌వంతంగా స్టేట్‌మెంట్‌లు రికార్డు చేయ‌డం సీబీఐ విచార‌ణ ప‌క్క‌దారి ప‌డుతోంద‌నే ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుస్తోంది. ఇందులో *సీబీఐ ఐవో* తీరుపై విమ‌ర్శ‌లు ఉన్నాయి.*

*విచార‌ణ‌లో ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వెల్ల‌డించిన అంశాలు కూడా తారుమారు చేయ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది.*

*మాటి మాటికి ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని విచార‌ణ‌కు పిల‌వ‌డం .. ఏదో జ‌రుగుతోంద‌ని భ్ర‌మ ప్ర‌జ‌ల్లో క‌లిగించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది ?*

*ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా సీబీఐ విచార‌ణ పేరిట వేధించ‌డం పొలిటిక‌ల్ కేరీర్‌ను నాశ‌నం చేయాల‌నే టార్గెట్ క‌న‌బ‌డుతోంది.*

*హ‌త్య‌ కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఇరికించాల‌నే తాప‌త్ర‌యం ఎవ‌రి స‌ల‌హా మేరకు విచార‌ణ చేస్తున్నారు.*

*సీబీఐ విచార‌ణ బీజేపీలోని టీడీపీ కోవ‌ర్టులు ఇన్‌ఫ్లుయ‌న్స్ చేస్తున్న‌ట్లు ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి.*

*నిందితుడు ద‌స్త‌గిరి అకౌంట్‌కు 75 వేలు జ‌మ చేసింది ఎవ‌రు ? ఎందుకు చేశారు ?*
*వాస్త‌వాలు బ‌హిర్గతం చేయాలి.*

*నిందితుడు ద‌స్త‌గిరి బెయిల్ పిటిష‌న్‌ను సీబీఐ వ్య‌తిరేకించ‌క‌పోవ‌డంపై అనుమానాలు*

* హ‌త్య కేసు నిందితుడు ద‌స్త‌గిరిని ఇంత‌వ‌ర‌కు ఎందుకు అరెస్టు చేయ‌లేదు.*

*ఇది విచార‌ణ‌ను ప్ర‌భావితం చేసిన‌ట్లా ? కాదా?*

*వైఎస్ వివేకా మ‌ర‌ణ వార్తను వైఎస్ అవినాశ్‌రెడ్డికి మొద‌ట చేర‌వేసింది .. ఎవ‌రు?*

*వివేకా చ‌నిపోతే అనుమానించాల్సింది మొద‌ట ఎవ‌రిని ?*

*ఆ కోణంలో సీబీఐ విచార‌ణ ఎందుకు సాగ‌డం లేదు.*

*ఎలాంటి విశ్వ‌స‌నీయత‌, నిజాయ‌తీ లేని, హ‌త్య చేసిన‌ట్లు ఒప్పుకున్న ద‌స్త‌గిరి చెప్పిన వ్య‌క్తుల‌నే మాటి మాటికి విచార‌ణకు పిల‌వ‌డం క‌రెక్టేనా?*

*వివేకా ఆస్తిని వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న ముస్లిం మ‌హిళ‌కు వెళ్ల‌కుండా అడ్డుప‌డినది కూతురు సునీత‌, అల్లుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డే క‌దా?*

*వివేకా ఇంట్లో పెద్ద ఎత్తున గొడ‌వ‌లు ఉన్న విష‌యం వాస్త‌వ‌మా ? కాదా?*

*మాజీ మంత్రి వివేకాను చంపితే ఎవ‌రికి లాభం ? ఎవ‌రికి న‌ష్టం?*

*వివేకా చ‌నిపోతే ఆస్తి ఎవ‌రికి ద‌క్కుతుంది ?*

*వివేకాకు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ లేకుండా చేసింది ఎవ‌రు ?*

*వివేకాతో కుటుంబ స‌భ్యులు విభేదించి.. వివేకాను ఒంట‌రిని చేసింది ఎవ‌రు ?*

*వివేకా మ‌ర‌ణించిన స‌మ‌యంలో ఆయ‌న రాసిన‌ట్లుగా చెబుతున్న లేఖ‌ను గోప్యంగా ఉంచింది ఎవ‌రు? ఎందుకు? ర‌హ‌స్యంగా దాచాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది.*

*స‌గ‌టు జ‌నం ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతున్నారు.. వీట‌న్నింటిపై విచార‌ణ‌ దిశ‌గా కేసును న‌డిపిస్తే కొంత‌ వ‌ర‌కైనా సీబీఐకి విశ్వ‌స‌నీయ‌త ద‌క్కుతుంది…..*

*CBI విచారణ మాదిరి కాకుండ, సునీత బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ మాదిరి గా వుంది అని ప్రజలు గట్టిగ నమ్ముతున్నారు…

*తెలంగాణ హైకోర్టులో*
*కడప ఎంపీ*
*వై.యస్.అవినాష్‌రెడ్డి*
*రిట్ పిటిషన్‌ దాఖలు*

వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో..
ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కోరిన అవినాష్‌రెడ్డి
తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని
160 CRPC నోటీస్‌ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు ,చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరిన అవినాష్‌రెడ్డి
పిటిషన్‌లో పేర్కొన్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని..
ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదు: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదు
దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..
సీబీఐ విచారణ కొనసాగుతోంది: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
నాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..
ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది: అవినాష్‌రెడ్డి
వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉంది: అవినాష్‌రెడ్డి
వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..
అదే కోణంలో విచారణ చేస్తున్నారు: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి
తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారు: అవినాష్‌రెడ్డి
నేను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారు: అవినాష్‌రెడ్డి

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment