అయ్యన్నపై ఫోర్జరీ కేసు.. దర్యాప్తునకు సుప్రీం ఓకే
హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన ఇల్లు నిర్మించే క్రమంలో ఎన్‌ఓసీ కోసం నీటిపారుదల శాఖ అధికారి సంతకాలను అయ్యన్న ఫోర్జరీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ వ్యవహరంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ సెక్షన్ 41సీఆర్‌పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగానే విచారణ చేయాలని హైకోర్టుకు సూచించింది.