ప్రీతికి కన్నీటి వీడ్కోలు.. స్వగ్రామంలో అంత్యక్రియలు

Get real time updates directly on you device, subscribe now.

ప్రీతికి కన్నీటి వీడ్కోలు.. స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు

హ్యూమన్ రైట్స్ టుడే/జనగాం/కొడకండ్ల: హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి (26) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇంటి వద్ద ప్రీతి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మధ్యాహ్నం మృతదేహాన్ని ట్రాక్టర్‌పై ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.

అంత్యక్రియలకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. భాజపాకు చెందిన మాజీ ఎంపీ రవీందర్‌నాయక్‌, కాంగ్రెస్‌ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక భారాస నేతలు, జీసీసీ ఛైర్మన్‌ గాంధీనాయక్‌, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు ప్రీతి పాడెను ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మోశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment