విమానాశ్రయాల మాదిరిగా…సికింద్రాబాద్ రైల్వే స్టేషన్…
*అభివృద్ధి పనులకు 720 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విమానాశ్రయాలు ఉండే విధంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ఆ దశలో అడుగులు వేస్తుంది. దీంట్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 720 కోట్ల రూపాయలను కేటాయించింది ఆ నిధులతో శరవేగంగా పనులు సాగుతున్నాయి. 2025 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో కేంద్రం పని చేస్తుంది. ప్రయాణికులు బయటకు రావడానికి లోనికి వెళ్లడానికి ప్రత్యేకంగా వేరే వేరే లిఫ్టులు ఎక్స్ లెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ స్థలం విశ్రాంతి భవన నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రయాణికుల నీటి వినియోగం కోసం ఫోర్ జి ఎల్ ఆర్ పైపులతో నిర్మాణం చేపడుతుంది.
ప్రయాణికుల రాకపోకల సంబంధించిన విషయమై ప్లాన్ మార్పులు చేపడుతున్నారు. స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తుల కొరకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. 40 ఏళ్ల అవకాశాలకు అనుగుణంగా డిజైన్ రూపకల్పన చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు అత్యధిక భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.
2025 నాటికి ఈ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.