ఎమ్మెల్సీ ఎంపికలో ఎస్టీలకు సామాజికన్యాయం ఎక్కడ?
—టిడిపి గుంటూరు జిల్లా యస్.టి సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి: సోమవారం వైసీపీ ప్రభుత్వం విడుదలచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో గిరిజనులకు ఎక్కడ న్యాయం జరిగిందని వైసీపీ ప్రభుత్వాన్ని గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే సియం జగన్ లక్ష్యం అని చెప్తున్న సజ్జల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో గిరిజనులకు సామాజికన్యాయం ఎక్కడ జరిగిందని నిలదీశారు.
58 మంది శాసనమండలి సబ్యులకు గానూ నేటికీ మీ ప్రభుత్వ హయాంలో ఒక్క గిరిజనుడికీ ఎమ్మెల్సీగా ఎంపిక చేయలేదేందుకని.
ఎస్టీ,ఎస్సి,బిసి,మైనార్టీలకు ప్రభుత్వరంగ సంస్థల్లో నామినేటెడ్ పదవుల ఎంపికలో 50% రిజర్వేషన్ అమలుకోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 24 జీవోను శాసనమండలికి ఎందుకు వర్తింపచేయరు.
నేడు వైసీపీ ప్రభుత్వం విడుదలచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో శాసనసభ్యుల క్వాట,స్థానిక సంస్థల క్వాటాలో గిరిజన అభ్యర్థులు ఎందుకులేరని?అర్హులులేకనా గిరిజనులు అసమర్థులనా?సజ్జలగారు సమాధానం చెప్పాలన్నారు.
కాళీ అవ్వడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ,ఎప్పుడో ఎంపికచేయబోయే గవర్నర్ క్వాటాలో కుంభ రవిబాబుకు ఎస్టీ కి ఇవ్వబోతున్నామని నేడు విడుదల చేసిన జాబితాలో కలిపి ఇవ్వడం చూస్తే, ఎప్పుడో పుట్టబోయే బిడ్డకు ముందుగానే పెరుపెట్టినట్లు వైసీపీ ప్రభుత్వం తీరుఉందని ఎద్దేవా చేశారు.
నేడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జాభితా విడుదల చేస్తూ రాష్ట్రంలో నిజమైన సాధికారథకు ఇదే సాక్ష్యం అని చెప్తున్నారని సజ్జలగారూ మీకు గిరిజనుల సాధికారత పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజనుల పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ 6%ప్రకారం లేదా మీరు విడుదల చేసిన 24 జీఓ ప్రకారం 58 ఎమ్మెల్సీ స్థానాలకు గాను నలుగురు ఎస్టీలను శాసనమండలికి ఎంపికచేసి అప్పుడు వైసీపీ ప్రభుత్వం సాధికారత, సామాజికన్యాయం గురించి మాట్లాడాలని మేడా రామకృష్ణ ప్రభుత్వాన్ని నిలదీశారు.