యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

Get real time updates directly on you device, subscribe now.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు

హ్యూమన్ రైట్స్ టుడే/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను ఆలయ ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

తేదీల వారీగా బ్రహ్మోత్సవాలు.. నిర్వహించే కార్యక్రమాల వివరాలు..
* 21-02-2023 : ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం.

* 22-02-2023 : ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ. 11 గంటలకు ధ్వజారోహణం. సాయంత్రం 6.30గంటలకు భేరీపూజ, దేవత ఆహ్వానంహవనం.
* 23-02-2023 : ఉదయం 8 గంటలకు అలంకార, వాహన సేవలకు శ్రీకారం. 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేద పారాయణం. రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ.

* 24-02-2023 : ఉదయం 9 గంటలకు వటపత్రసాయి అలంకార సేవ. రాత్రి 7 గంటలకు హంస వాహనసేవ.

* 25-02-2023 : ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ. రాత్రి 7 గంటలకు పొన్న వాహనసేవ.

* 26-02-2023 : ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ. రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ.
* 27-02-2023 : ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం.

* 28-02-2023 : ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ. రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామిఅమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.

* 01-03-2023 : ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ. రాత్రి 7 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.
ప్రకటన:
* 02-03-2023 : ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం. సాయంత్రం 6 గంటలకు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన.
* 03-03-2023 : ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment