కాలు జారి కింద పడిన గవర్నర్ తమిళిసై..
హ్యూమన్ రైట్స్ టుడే/చెన్నై : గవర్నర్ తమిళి సై కాలు జారి కింద పడిపోయారు. తమిళనాడులో ఆదివారం జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె కాలు జారి కింద పడ్డారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం తమిళనాడులో పర్యటించారు. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె నడుస్తూ నడుస్తూనే ఒక్కసారిగా కాలు స్లిప్ అయ్యి ఒక్కసారిగా కిందపడి పోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆమెను లేపి నిలుచోబెట్టారు. అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ తాను కిందపడిపోయినందున ఈ వార్త టీవీల్లో హైలైట్ అవుతుందంటూ సరదాగా పేర్కొన్నారు.
హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం నిన్న తమిళనాడులోని మామల్లపురం సమీపంలోని పత్తిపులం గ్రామంలో జరిగింది. అయితే తెలంగాణతో పాటు తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రసంగించారు. అనంతరం ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కార్పెట్‌పై జారి పడిపోయారు.
150 బుల్లి ఉపగ్రహాలు నింగిలోకి.. దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 150 బుల్లి ఉపగ్రహాలు ఆదివారం నింగిలోకి ఎగిరాయి. సుమారు 3500 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 12వ తరగతి చదివే 5వేల మంది విద్యార్థులు తయారుచేసిన 150 మినీ హైబ్రి డ్ ఉపగ్రహాల (పైకో శాటిలైట్స్)ను ఆదివారం తమిళనాడులోని చెంగ ల్పట్లు జిల్లా మహాబలిపురం సమీపంలోని తిరువిడందై నుంచి ప్రయో గించారు. ఈ రాకెట్ ప్రయోగాన్ని డాక్టర్ ఏపీఏ అబ్దుల్ కలాం ఇంటర్నే షనల్ ఫౌండేషన్, మార్టిన్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సంయుక్తం గా చేపట్టాయి. ఏపీజే అబ్దుల్‌కలాం స్టూడెంట్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్-2023 పేరుతో వీటిని ప్రయోగించారు.