యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులకు తప్పిన ప్రమాదం..
12 మందికి తీవ్ర గాయాలు, తృటిలో తప్పిన ప్రమాదం…
హాస్పిటల్ కు తరలించి వైద్యం అందిస్తున్న డాక్టర్లు, పత్తాలేని యాజమాన్యం…
హ్యూమన్ రైట్స్ టుడే/ సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో గల భవిత జూనియర్ కళాశాలలో ఆదివారం సాయంత్రం విద్యార్థులు సేద తీరేందుకు కళాశాల బయట నిలిచి ఉండగా ఒకేసారి బిల్లింగ్ కంటే గోడ కూలి 12 మంది విద్యార్థులకు గాయాలు కాగా హుటాహుటిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలియజేశారు.
గతంలో ఇదే యాజమాన్యం సంబంధించి ఓ కళాశాలలో విద్యార్థిని బిల్లింగ్ పైనుంచి పడి హాస్పిటల్ పాలైన విషయం మరువకముందే మరో సంఘటన పునరావృతం కావడం యాజమాన్య నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఫీజులు వసూలు చేసే శ్రద్ధ, పిల్లల భవిష్యత్తుపై లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా ఇప్పటివరకు కళాశాల యాజమాన్యం రాకపోవడం కోసమేరుపు.