పశుమిత్రల సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి 22వ తేదీన జరుగు చలోహైదరాబాదు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
తెలంగాణ రాష్ట్ర పశుమిత్ర వర్కర్స్ యూనియన్ (CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు.మాధవి
హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట: పశుమిత్ర జిల్లా సమావేశానికి పశుమిత్ర వర్కర్స్ యూనియన్(CITU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసు మాధవి హాజరై మాట్లాడుతూ పశుమిత్రులు గత ఎనమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఎలాంటి వేతనం చెల్లించుటలేదు. పశుమిత్రలు క్షేత్ర స్థాయిలో పశుపోషకులకు – పశు సంవర్ధక శాఖకు వారధిగా పని చేస్తారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ చేస్తూ పశు పోషణపై అవగాహణ కల్పస్తూ పశూత్పత్తుల మార్కెటింగ్ సమాచారం, పశు బీమా మొదలైన సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూగ జీవాలకు మసూచి, గాలికుంటు, నీలి నాలుక, న్యుమోనియా, మూతి, కాలి పుండ్లు వంటి పన్నెండు రకాల పశు వ్యాధులకు, వైరస్ లకు వైద్య సేవలు అందిస్తున్నారు. భారత దేశ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న పశు సంపదను పరిరక్షిస్తున్న పశుమిత్రలకు ఎలాంటి వేతనం లేకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవడం దుర్మార్గం. కావున పశుమిత్రలకు తగిన వేతనం వెంటనే చెల్లించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏ.ఐ. ట్రైనింగ్ పశుమిత్రలందరకీ ఇవ్వాలని, ఈ ఎస్ ఐ, పి ఎఫ్ సౌకర్యం కల్పించాలని, పశుమిత్రలకు గ్లౌజులు, మాస్కలు ఇవ్వాలని, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఫిబ్రవరి 22 వ తేదీన చలో హైదరాబాదు ఇందిరాపార్కులో ఉదయం 10 గంటలకు జరుగు పశుమిత్రల ధర్నాకు పశుమిత్రలు అధిక సంఖ్యలో పాల్గనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో CITU సూర్యపేట జిల్లా అద్యక్షులు యం.రాంబాబు, కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు, శ్రామిక మహిళా కన్వీనర్ యాకలక్ష్మి, పశుమిత్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొత్త రజిని పాల్గన్నారు. అనంతరం పశుమిత్రల జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. పశుమిత్రల సూర్యపేట జిల్లా అధ్యక్షురాలిగా స్వప్న, కార్యదర్శిగా దేవకన్యను ఎన్నుకోవడం జరిగింది.
*డిమాండ్స్*
1.పశుమిత్రలకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి.
2.గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
3. యూనిఫాం ఇవ్వాలి. 4.ESI, PF సౌకర్యం కల్పించాలి.
5.కృత్రిమ గర్భధారణ(AI) శిక్షణ అందరికీ ఇవ్వాలి.
6.టి.ఎ., డి.ఎ. లు ఇవ్వాలి.
7.మందులతో కూడిన కిట్ ఇవ్వాలి, గ్లౌజులు, మాస్కులు ఇవ్వాలి.
8.ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి.