గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం

Get real time updates directly on you device, subscribe now.

డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి….గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం…

హ్యూమన్ రైట్స్ టుడే: గుజరాత్‌లో నోట్ల వర్షం కురిసింది. గాల్లో ఎగిరిపడుతున్న కరెన్సీ నోట్లను అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. తమ కుమారుడి వివాహం సందర్భంగా ఓ కుటుంబం ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది. మెహ్‌సాణా జిల్లా కడీ తాలుకాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. గడిచిన మూడు రోజుల నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. కింద ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడడం వీడియోలో కనిపిస్తోంది. ఒకరినొకరు తోసుకుంటూ నోట్లను అందుకునే ప్రయత్నం చేయడం వీడియోలో రికార్డైంది. మాజీ సర్పంచ్‌ కరీంభాయి దాదుభాయి జాదవ్‌ మేనల్లుడు రజక్‌ వివాహం సందర్భంగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వారి కుటుంబంలో రజక్‌ ఒక్కడే మగ సంతానం అని, అందుకే ఇలా చేశారని సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment