SC వర్గీకరణ రిజర్వేషన్ చట్టం అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిన రోజు.
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/Apr 14, 2025:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కాస్ట్ (SC) వర్గీకరణ రిజర్వేషన్ చట్టం 2025ను అధికారికంగా అమలు చేసింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలోని 56 ఎస్సీ జాతులను మూడుగా వర్గీకరించి, ఉప జాతుల మధ్య న్యాయంగా లబ్ధిదారుల పంపిణీ జరగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
