బ్రేకింగ్ న్యూస్ – హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతి
న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.
హైదరాబాద్ – బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి.
చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసులు
ఈక్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడటంతో.. ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్రవాహనదారుడి.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన వాహనదారులు, కుటుంబసభ్యులు.
బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కుటుంబ సభ్యులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు.
