హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 25: ఈ ఫోటోలో ఉన్న మహిళ కడప జిల్లా ప్రాంతంలో సంచరిస్తూ ఉంది. ఈమె టార్గెట్ ఫోన్ పే ఉన్నవాళ్లు
గూగుల్ పే ఉన్నవాళ్లు మాత్రమే..
వారి వద్దకు ఈ మహిళ ఒక చిన్న బాబుతో వచ్చి
అన్నా మా బాబుకి బాగాలేదు హాస్పిటల్ కి వెళ్ళాలి. మాకు తెలిసిన వాళ్లు హైదరాబాదులో ఉన్నారు మా బాబుని హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు పంపిస్తారు. మీ దగ్గర ఫోన్ పే కానీ గూగుల్ పే ఉంటే
మా వారు డబ్బులు వేస్తారు నాకు నగదు ఇవ్వండి అని చెప్పి బతి మాలుతుంది. వీలైతే మీ రెండు కాళ్లు కూడా పట్టుకుంటుంది ఏడుస్తుంది. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత నే…
అసలు కథ మొదలవుతుంది..
హైదరాబాదులో ఉన్న ఈమె బంధువులు వారి యొక్క టార్గెట్ ఫోన్ పే సీక్రెట్ లాక్ తెలుసుకోవడం తర్వాత మొబైల్ దొంగతనం మరియు వారి ఫోన్ పే ద్వారా నగదు వారికి సంబంధించిన ఫోన్ పే కి వెంటనే పంపించి హ్యాకింగ్ చేయడం.
ఇక్కడ మహిళకు ఫోన్ పే ద్వారా నగదు ఇచ్చిన వ్యక్తి యొక్క ఫోన్ ఫే హ్యాకింగ్ గురి కావడం ఫోన్ పేలో ఉన్నటువంటి నగదు దోచుకోవడం కడప జిల్లా ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి ఇప్పటివరకు ఈ మహిళ మోసం చేసిన వ్యక్తుల యొక్క సంఖ్య 70 వరకు బాధితులు ఉన్నారు.
