భారాస ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల అరెస్ట్
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం హైదరాబాద్ తరలిస్తున్నారు.
శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం షర్మిలను అరెస్ట్ చేశారు.