హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 22: పార్లమెంటు పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరిలు ఎన్నికయ్యారు. ఈ కమిటీలోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికకు మొత్తం 22 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఏడుగురు సభ్యులు పోటీ నుంచి తప్పుకోవడం తో 15 మంది సభ్యుల ఎన్నిక ఏకగీవ్రంగా జరిగింది.
