ప్రముఖ లెజెండ్ బాక్సర్ జార్జ్ ఫోర్ మెన్ మృతి

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ క్రైమ్/మార్చి 22: ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం జార్జ్ ఫోర్‌మెన్ (76) ఈరోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌ గెలవడంతో పాటు రెండు సార్లు హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్లో 68 నాకౌట్లలో పాల్గొనగా ఐదింట్లో మాత్రమే ఓటమి పాలయ్యారు.

1997లో బాక్సింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రముఖ బాక్సర్ మహమ్మద్ అలీతో 1974లో జరిగిన పోరులో ఓటమి పాలయ్యారు. 1968 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవడంతో పాటు రెండుసార్లు హెవీ వెయిల్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.

1990లలో బాక్సింగ్‌కు రిటై ర్మెంట్ ప్రకటించిన ఫోర్‌ మాన్ తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్లాడు. గృహోపకరణ ఉత్పత్తులను ప్రమోషన్ చేస్తూ, సాల్టన్ ఇంక్ నుండి ఎలక్ట్రిక్ గ్రిల్‌ను ప్రచారం చేయడంలో తన ప్రతిభను చూపించాడు.

ఆయన జీవితం కేవలం బాక్సింగ్ ప్రపంచంలో మాత్రమే కాదు, వ్యాపార రంగంలో కూడా ప్రతిష్టాత్మకంగా నిలిచింది. జార్జ్ ఫోర్‌మాన్ అనేది కేవలం ఒక బాక్సింగ్ అగ్రగామి కాకుండా.. ఒక గొప్ప వ్యక్తి కూడా. ఆయన అందించిన స్ఫూర్తి, మానవతా సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment