సీఎంకు, రెవెన్యూ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి..!!
10,954 జీపీఓ పోస్టుల మంజూరు చేస్తూ జీవో విడుదల..!!
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 22: తెలంగాణ రెవెన్యూ జేఏసీ కృషి ఫలితంగానే రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన అధికారుల (జీపీఓ) పోస్టులు మంజూరు అయ్యాయని ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.
ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రామ పాలన అధికారుల వ్యవస్థను అందుబాటులోకి ప్రభుత్వం తెలుస్తుందన్నారు.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

డీసీఏ, టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ హర్షం..
10,954 గ్రామ పాలన అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ జీఓ విడుదల పట్ల డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.భిక్షం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.