హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 22: గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్దీస్తామని, సీఎం రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ప్రకటించినట్లుగానే మంత్రి మండలి 10,954 గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు ఆమోదం ఆమోదముద్ర వేసింది.
రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.
తెలంగాణలో 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పాలన అధికారుల(GPO) పోస్టులు మంజూరు చేస్తూ శనివారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు GPO గా నామకరణం చేసింది. కాగా రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలన అధికారులను నియమించాలని, రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
గత ప్రభుత్వం వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసింది. మళ్లీ గ్రామ పాలన అధికారులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
