బయట పడ్డ విద్యాశాఖ, పోలీసుల నిర్లక్ష్యం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 22: నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్బీసీ బాలుర గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది.
నిన్న ఉదయం విద్యార్దులకు ప్రశ్నా పత్రం ఇచ్చిన 10 సెకన్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ప్రశ్నాపత్రం. పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ప్రమేయంపై అనుమానం. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ అధికారులు.
గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఎలా వెళ్లిందనే దానిపై ఆరా.
ఎగ్జామ్ సెంటర్ నుంచి వాట్సాప్ ద్వారా బయటికి వచ్చిన ప్రశ్నపత్రం.
క్షణాల్లో సదరు ఎగ్జామ్ సెంటర్ కు జీరాక్స్ ద్వారా ఆన్సర్ షీట్స్ అందించారన్న ఆరోపణలు.
ప్రైవేట్ స్కూల్స్ తో విద్యాశాఖ అదికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు.
ఇష్యూ సిల్లీగా క్లోజ్ చేసేందుకు జరుగుతున్న అధికారుల ప్రయత్నాలు.
