తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 22: తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.

రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రంతా ఈదురుగాలులు, భారీ వడగళ్లతో భారీ వర్షం పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ లో దాదాపు ప్రళయమే కనిపించింది. చాలా జిల్లాల్లో వరి, మొక్కజొన్న పంటలు తీవ్ర నష్టపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. కాగజ్ నగర్ లో గోడ కూలి ఓ వ్యక్తి మరణించాడు.

ఊహించని విధంగా దాదాపు తుఫానులా వర్షం విరుచుకుపడింది. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. వర్షాలకు తోడు ఈదురు గాలులు బీభత్సమే సృష్టి స్తున్నాయి. చాలా జిల్లాల్లో పెద్ద చెట్టు కూడా నేలకూ లాయి. కరెంటు స్తంభాలు పక్కకు ఒరిగాయి.

వర్షాకాలంలో కూడా ఈ స్థాయి వర్షాలు పడలేదు. అలాంటిది రాత్రి భారీగా కురిసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్ ఆ చుట్టు పక్కల జిల్లాలు ఉత్తర తెలంగాణ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, మండలం మద్దుల్ తండా, హొన్నాజిపేట్, వాడీ, గుడి తండాలో కొండూరు, న్యవనంది రవుట్ల గ్రామాలలో ఈదురు గాలులతో వడగండ్ల వానకు వరిగింజలు నేలరాలాయి. ఈదురు గాలులకు వరి పంట నాశనం అయిపోయింది.

మరో రెండు రోజులు వర్షాలు ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ పరిస్ధితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment