పోలీసుల చిత్రహింసలతో కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనే వ్యక్తి మృతి
హ్యూమన్ రైట్స్ టుడే/ నిజామాబాద్/ క్రైమ్/మార్చి 14: పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే గల్ఫ్ ఏజెంట్‌ను విచారణకు తీసుకొచ్చిన వన్ టౌన్ పోలీసులు. విచారిస్తున్న సమయంలో సంపత్ కుప్ప కుప్పకూలిపోవడంతో హుటా హుటిన పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, అప్పటికే సంపత్ మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు.
ఆసుపత్రి బైట మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన.
పోలీసులు కొట్టడం వల్లే సంపత్. మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపణ.
సంపత్ మృతదేహంతో నిజామబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా.
తమకు న్యాయం జరిగేంత వరకు శవాన్ని తీసేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.
సంపత్ కొందరిని దుబాయ్ దేశం పంపాడు అయితే అక్కడ పని లేక వారు తిరిగి రావడంతో వారు సంపత్ పై పోలీస్ కేసు నమోదు చేశారు.
