ప్రతీ ఒక్క మహిళ ఫోన్లో నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందగలరు..
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /పల్నాడు జిల్లా /మార్చి 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలికల భద్రత కొరకు శక్తి యాప్ (SHAKTI App) ను ప్రవేశపెట్టింది.
ఈ యాప్ ప్రధానంగా మహిళలపై జరిగే వేధింపులు, అత్యాచారాలు, మరియు ఇతర హింసాత్మక సంఘటనలను నివారించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని కావున పల్నాడు జిల్లాలో ప్రతీ ఒక్క మహిళ, గృహిణిలు విద్యార్థినిలు, బాలికలు వారి యొక్క ఫోన్లు నందు ఈ శక్తి యాప్ ను నిక్షిప్తం చేసుకుని ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం, సహకారం పొందాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ తెలిపారు.
ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఎస్.ఓ.ఎస్ బటన్ ప్రెస్ చేస్తే వారు ఉన్న ప్రాంతం వివరాలు దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ నకు డయల్ 112 నెంబరుకు చేరుతుందని వెంటనే పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకొని వారికి రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ యాప్ ను ఫోన్లో నిక్షిప్తం, ఉపయోగించే విధానం:
1. ముందుగా ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) ద్వారా “SHAKTI App” ను డౌన్లోడ్ చేసుకోవాలి.
2. మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి.
3. ఓటిపి తో ఫోన్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి.
4. అత్యవసర పరిచయాలను (Emergency Contacts) beforehand జోడించాలి.
5. ఏదైనా ప్రమాదం జరిగితే, యాప్ ఓపెన్ చేసి SOS బటన్ ను నొక్కితే, మీ యొక్క స్థానాన్ని (Location) గుర్తించి పోలీసులు తక్షణమే స్పందిస్తారు.
శక్తి యాప్ యొక్క ముఖ్య ప్రయోజనాలు:
1. అత్యవసర సహాయం – మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు, ఈ యాప్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వవచ్చు.
2. ఒక క్లిక్ SOS అలర్ట్ – ఒక్క కీ నొక్కితే పోలీసులకు, కుటుంబసభ్యులకు, లేదా స్నేహితులకు అప్రమత్తమైన సందేశం వెళ్ళిపోతుంది.
3. జియో-లోకేషన్ ట్రాకింగ్ – అత్యవసర పరిస్థితుల్లో, పోలీస్ కంట్రోల్ రూమ్ మహిళ ఉన్న ప్రదేశాన్ని తక్షణమే గుర్తించి సహాయం అందించగలదు.
4. నేరం నివేదిక (Complaints Registration) – వేధింపు, లైంగిక దాడి, ఎవరైనా శారీరకంగా హాని కలిగించినప్పుడు, మహిళలు ఈ యాప్ ద్వారా నేరాన్ని అధికారులకు తెలియజేయవచ్చు.
5. సమాచార అవగాహన – మహిళా హక్కులు, రక్షణ చట్టాలు, మరియు ప్రభుత్వ నిబంధనల గురించి పూర్తి వివరాలు పొందవచ్చు.
6. ప్రత్యక్ష పోలీస్ సహాయం – సమీపంలోని పోలీస్ స్టేషన్ సమాచారం, హెల్ప్ లైన్ నంబర్లను యాప్ లో పొందుపరిచారు.
జిల్లా మహిళలకు జిల్లా ఎస్పీ ముఖ్య విజ్ఞప్తి: మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ఉద్యోగినులు, గృహిణులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ అవసరమైన వారు ఈ యాప్ ద్వారా మరింత భద్రంగా ఉండగలరు మరియు అత్యవసర సమయంలో పోలీస్ వారి యొక్క సహాయాన్ని పొందగలరు అని, మహిళలు, చిన్నారులు తమకు ఎదురయ్యే వివిధ పిర్యాదులు, ఇబ్బందులపై పోలీసు వారి సహాయం కొరకు శక్తి యాప్ ద్వారా పొందవలనని, సిబ్బంది తక్షణమే స్పందించి డయల్ 112 కాల్స్ ను దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం చేరవేస్తే పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వారికి తక్షణ సహాయం, సహకారం అందిస్తారని, కావున జిల్లాలో ప్రతీ ఒక్క మహిళ, విద్యార్థినిలు, బాలికలు, ఉద్యోగినులు, గృహిణులు మీ యొక్క ఫోన్లు నందు ఈ శక్తి యాప్ ను నిక్షిప్తం(డౌన్లోడ్) చేసుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ కోరారు.
అనంతరం ఎస్పీ జిల్లా నందు శక్తి వాహనాలను ప్రారంభించినారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (పరిపాలన) J.V. సంతోష్, నరసరావుపేట డిఎస్పి నాగేశ్వరరావు, సత్తెనపల్లి డి.ఎస్.పి హనుమంతరావు, గురజాల డిఎస్పి జగదీష్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రమణ, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుభాషిణి మరియు మహిళా ఎస్సై లు, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
