గంగాధర: ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన: కలెక్టర్
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 13: గంగాధర మండలం గట్టుబుత్కూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. వారికి ఇస్తున్న ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంగ్లీష్ పాఠాలను బోధించారు.
