హ్యూమన్ రైట్స్ టుడే/ ఆంధ్ర ప్రదేశ్/మార్చి 13: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోరం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికలో మార్పులను గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం బయట పడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సీ కేసు నమోదు చేశారు. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.
