‘భూ భారతి’ అమలుకు రంగం సిద్ధం… అందరికీ అర్థమయ్యేలా మార్పులు
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ తెలంగాణ/ మార్చి 11: భూ భారతి చట్టం అమలుకు రాష్ట్ర సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా, వారే స్వయంగా దరఖాస్తు చేసుకునేలా పోర్టల్‌ను రూపుదిద్దుతున్నారు. దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన, స్లాట్ బుకింగ్స్, రిజిస్ట్రేషన్లకు అవరోధం లేకుండా ఉండేలా టెక్నికల్‌గా ఆరు నుంచి ఏడు మాడ్యూళ్లు మాత్రమే ఉండేలా అప్డేట్ చేయనున్నారు. ధరణి పోర్టల్‌లోని మార్పులన్నింటినీ భూ భారతి పోర్టల్ ద్వారా అమలులోకి తీసుకురానున్నారు.
