తోపుడు బండ్ల వ్యాపారులు చట్ట పరిధిలో వ్యాపారాలు నిర్వహించాలి..
జిల్లా ఆహార నియంత్రణాధికారి కె. వెంకటరత్నం..
హ్యూమన్ రైట్స్ టుడే/శ్రీకాకుళం/మార్చి 09: తోపుడు బండ్లు వ్యాపారులు చట్ట పరిధిలో వ్యాపారాలు నిర్వహించుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి కె. వెంకటరత్నం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ కాలినడకన తోపుడు బండ్ల పై ప్యాక్ చేసిన లేదా తాజాగా తయారు చేసిన ఆహారాన్ని విక్రయించే వ్యాపారస్తులు ఎటవంటి రుసుములు చెల్లించకుండా ఎఫ్ఎస్ఎస్ఎఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను ఎఫ్ఎస్సిఎఎస్ పోర్టల్, యూజర్ మాన్యువల్ ద్వారా ఉచితంగా పొందవచ్చుని తెలిపారు. https://fscos.fssai.gov.in/user-manual ఉత్తర్వులు 28 సెప్టెంబర్, 2024 వర్తింపులోనికి వచ్చినట్లు ఆయన వివరించారు. వివరములకు helpline 1800112100 లేదా helpdesk – foscos.gov.in ను సంప్రదించాలన్నారు. కావున హాకర్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చట్ట పరిధిలో వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు.
