జర్నలిజం అంటే బ్రోకరిజం కాదు..

Get real time updates directly on you device, subscribe now.

జర్నలిజం ఇదే! నిజమైన ఇజం!!  

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్ /మార్చి 08: మిత్రులకు జర్నలిజం అంటే బ్రోకరిజం కాదు.. తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది.. నేలను చదును చేసే నాగలి వంటిది.
జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు, జర్నలిస్ట్ అంటే అక్షరాలను తూటాల్లా చేసుకుని, అవినీతి లొసుగులను బయటకులాగే వేటగాడు.. పొలంలో విత్తుని మొలకెత్తించడానికి రైతు తన శ్రమను ఎలా ధారపోస్తాడో, ఒక వార్తను సేకరించడానికి, విలేఖరి తన సర్వశక్తులూ ఉపయోగిస్తాడు.. అతనిది బ్రతుకు పోరాటం.. ఇతనిది మంచిని బ్రతికించాలనే ఆరాటం.. జర్నలిజం బ్రతుకు అక్షరాల వెంట పరిగెడుతుంది..
ఉరుకుల పరుగుల జీవితంలో, తన చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకి పరిష్కారం చూపించాలనే తపనతో, కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు.. అలా రోజూ కామన్ మ్యాన్ లా ఆలోచించి జర్నీ మొదలు పెడతాడు జర్నలిస్టు… ఆ గడియారం ముల్లు ఒకటి నుండి పన్నెండుదాకా తిరిగితే.జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతూ, 24 గంటలు అదే ధ్యాసలో బ్రతికేస్తాడు. పేరుకు అతనికి 8 గంటలే డ్యూటీ అయినా. నిద్రపోనంత వరకు, బుర్ర మాత్రం సమాజం చుట్టే తిరుగుతూ ఉంటుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment