హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ మార్చి 07: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల హాల్‌టికెట్లు శుక్రవారం (మార్చి 7) విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో www.bse.telangana.gov.in నేడు హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనుంది.
టెన్త్ పబ్లిక్ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే..
2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష
2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్ పరీక్ష
2025 మార్చి 24 న ఇంగ్లీష్ పరీక్ష
2025 మార్చి 26 న మ్యాథ్స్ పరీక్ష
2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్ పరీక్ష
2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్ పరీక్ష
2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్ పరీక్ష
