మస్కట్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
హ్యూమన్ రైట్స్ టుడే/మస్కట్ – ఒమన్:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ఒమాన్ రాజధాని మస్కట్లో ఓమన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జూమ్ ఇన్ స్టూడియో యాజమాన్యం నిర్వహణలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి క్రీడాకారులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి జన్మదిన సందర్భంగా సీఎం సీఎం చంద్రశేఖర రావు పేరు మీద మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి విజేతలుగా విజేతలుగా నిలిచినటువంటి క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా కేకులు కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసీయుల సమక్షంలో పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. కే.సి.ఆర్. జన్మదిన వేడుకకు బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కే.సి.ఆర్. అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి, కే.సి.ఆర్.కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఓమాన్ బి ఆర్ ఎస్, ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ కే.సి.ఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడిగా సాగించిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి అభివృద్ధి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఒంటరి మహిళ వితంతువులకు ఫించన్ వృద్ధ మహిళ వికలాంగులకు మరియు రైతు బీమా రైతు బంధు దళిత బంధు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూ, జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించిన తీరును కొనియాడారు.
బి.ఆర్.ఎస్. పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులను, కే.సి.ఆర్. అభిమానులను కోరడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో తెలంగాణ టిఆర్ఎస్, ఎన్ఆర్ఐ సెల్ ఉపాధ్యక్షులు షేక్ హైమద్, తెలంగాణ జాగృతి అధ్యక్షులు గుండు రాజేందర్, నేత టిఆర్ఎస్ నాయకులు వడియాల దేవేందర్ రెడ్డి, బల్ల ఆంజనేయులు, బుకా శ్రీనివాస్ రాజులదేవ్, శ్రీనివాస్, రాజు యాదవ్, రాఖేష్ పాటెల్, శ్రీను, పరుశురాం, రాజేందర్, ఎన్నారై టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి కార్యక్రమాల నిర్వాహకులు జూమ్ ఇన్ స్టూడియో యాజమాన్యం వినయ్ ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేశారు.