భారత్ లో ఆసియా యోగాసనా ఛాంపియన్షిప్: నందనo కృపాకర్, జాతీయ సంయుక్త కార్యదర్శి యోగాసనా భారత్
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 05: భారత క్రీడా మంత్రి మన్షిక్ మండవియా విడుదల చేసిన ఒక ప్రకటనలో రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ కి భారతదేశం ఆతిథ్య మిస్తుందని ప్రకటించడం పట్ల నందనం కృపాకర్ హర్షం వ్యక్తం చేశారు.
మార్చ్ 29 నుండి 31 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరగబోయే ఈ ఛాంపియన్షిప్ నిర్వహణ కోసం యోగాసనా భారత్ ఏసియన్ ఒలంపిక్ కౌన్సిల్, ఇంద్రప్రస్థ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని ఒలంపిక్స్ లో యోగాసనాన్ని చేర్చడం లక్ష్యంగా ఆసియా యోగాసన యోగాసేన భారత్ ముందుకు వెళ్తున్నాయని ఎందుకోసం దీనికోసం ఆసియా యోగాసనా అధ్యక్షులు మిత్రులు సంజయ్ మాల్పాని వారి యొక్క టీం గత కొంత కాలంగా విశేష కృషి జరిపిందని దాని ఫలితమే ఇది అని అంటూ ఆసియా యోగాసనా అధ్యక్షులు మరియు వారి బృందానికి అభినందనలు తెలియజేశారు.
మార్చి 29 నుంచి 31 వరకు జరగనున్న ఈ ఛాంపియన్షిప్ లో 16 దేశాల నుండి యోగాసనాకి క్రీడాకారులు పాల్గొంటున్నారని అదే విధంగా భారతదేశం నుంచి ఎంపిక చేయబడ్డ యోగాసనాలు క్రీడాకారులకు ప్రత్యేకంగా జాతీయస్థాయిలో సెలక్షన్స్ ఫైల్స్ ఈనెల 16 నుంచి 17 వరకు పాటీ యాలాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో సెలక్షన్స్ జరుగుతాయని ఇందులో ప్రతిభను కనబరిచిన యోగాసనా ప్లేయర్స్ కి 18 నుంచి పది రోజులపాటు విశేషమైన శిక్షణను యోగాసనా భారత్ ఇస్తుందని తదనంతరం 29 నుంచి జరిగే ఆసియా చాంపియన్షిప్లో వేరు పాల్గొంటారని నందనం కృపాకర్ తెలియజేశారు.
ఈ శిక్షణా ట్రయల్స్ కి తెలంగాణ రాష్ట్రం నుండి ఒకరిద్దరిని పంపడానికి పరిశీలన ప్రారంభమైందని త్వరలోనే వారి పేర్లను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో యోగా ప్రాముఖ్యతను మరింత పెంచడానికి యోగాసన క్రీడను విశ్వక్రియలుగా మార్చడానికి యోగాసనా ఏషియా వరల్డ్ యోగాసన భారత్ సమైక్యంగా తమ నిరంతర కృషిని కొనసాగిస్తూ ఉన్నాయని త్వరలోనే ఆ స్వప్నాన్ని సహకారం చేసుకుంటామని విశ్వాసాన్ని కృపాకర్ వ్యక్తం చేశారు.
భారత క్రీడా మంత్రిత్వ శాఖచే రికగ్నైజేషన్ ఉన్న ఏకైక యోగాసనా ఫెడరేషన్ కేవలం యోగాసనా భారత్ మాత్రమేనని యోగాసనా భారత్ నిర్వహించే క్రీడలలో పాల్గొంటేనే యోగాసనా మెడలిస్టులకి హైయర్ ఎడ్యుకేషన్ లోనూ ఉద్యోగాలలోనూ రిజర్వేషన్లను యోగాసనా స్పోర్ట్స్ కోటాలో పొందడానికి అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని క్రీడాకారులు కోచులు జడ్జెస్ తల్లిదండ్రులు అందరూ గమనించాలని నందనం కృపాకర్ విజ్ఞప్తి చేశారు.
