హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/మార్చి 05: ఏపీ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా రాష్ట్రంలో ఉన్న 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న 3,920 సీట్లను భర్తీ చేయనున్నారు. మార్చి 31లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆయా తరగతుల మేరకు వయో పరిమితిని నిర్ణయించారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ లింక్ aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
