హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 03: తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో OP ఛార్జీలు ఇష్టారీతిన ఉన్నాయి. ప్రైవేట్ నుంచి కార్పొరేట్ వరకు సగటున రూ.500-రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఫేమస్ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే రూ.2000 కట్టాల్సిందే. సర్జరీల ధరలు చూస్తే పేషెంట్ల గుండెలు దడ పుట్టేలా ఉన్నాయి. నియంత్రణ లేని ఈ ఛార్జీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలని ప్రజలు కోరుతున్నారు. రేట్లు ఫిక్స్ చేయాలంటున్నారు.
