హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/మార్చి 03: రంజాన్ మాసంలో రుచి చూడాల్సిన స్పెషల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. రంజాన్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ హలీమ్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో వీధి వీధినా హలీమ్ సెంటర్లు దర్శనమిస్తాయి. రంజాన్ మాసంలో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్ పత్తర్ కా గోష్. నిప్పు మీద వెడల్పాటి రాయిపై మటన్ ముక్కలు ఉంచి ఈ వంటకం తయారు చేస్తారు. వీటితో పాటు నిహారి-కుల్చా, దహీ వడ, షాహి తుక్డా, షీర్ ఖుర్మా తప్పకుండా ట్రై చేయాలి.
