హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ స్పోర్ట్స్/ మార్చి 03: ఐదు వికెట్లు (5/42) పడగొట్టి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వన్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ సంతోషంగా ఉందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తనకి ఇదే తొలి మ్యాచ్ అని అన్నాడు.
