సీఎం కేసీఆర్‌ శివయ్యనే మోసం చేశారు: బండి సంజయ్‌

Get real time updates directly on you device, subscribe now.

సీఎం కేసీఆర్‌ శివయ్యనే మోసం చేశారు: బండి సంజయ్‌

హ్యూమన్ రైట్స్ టుడే/వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇచ్చిన మాట తప్పి శివయ్యనే మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మహాశివరాత్రి సందర్భంగా బండి సంజయ్‌ వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మూర్ఖపు పాలన అంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.

‘‘వేములవాడ వచ్చిన లక్షలాది మంది భక్తులు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. మంచి నీళ్లు కూడా లేక పసిపిల్లలు ఏడుస్తున్నారు. శివ దీక్ష తీసుకున్న భక్తులకు కూడా సౌకర్యాలు లేవు. రాజన్న ఆలయం అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదు. వేములవాడకు నయాపైసా ఇవ్వకుండా ఇక్కడి పైసలు తీసుకుపోయి బయట ఖర్చు చేయడం దారుణం. కావాలనే వేములవాడ ఆలయాన్ని సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రసాదం స్కీమ్‌ కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానని నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి వేడుకున్నా. వేములవాడతో పాటు కొండగట్టు, ధర్మపురి ఆలయాల అభివృద్ధికోసం కూడా ప్రతిపాదనలు పంపాలని అడిగినా.. పట్టించుకోలేదు. శివుడు అన్నీ గమనిస్తున్నాడు. పేదల కోసం రాజన్న ఆలయ అభివృద్ధి కోసం సీఎం రూ.10కోట్లు కూడా ఖర్చు చేయడం లేదు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దిల్లీ డిప్యూటీ సీఎంకు సీబీఐ నోటీసులు ఇచ్చింది, నీ బిడ్డకు కూడా ఏం జరగాలో అదే జరుగుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బండి సంజయ్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment